![]() |
![]() |
.webp)
చిన్న నవ్వు...ఒక్క థ్యాంక్స్ నిజంగా ఒక మనిషిని మార్చేస్తాయి..వాళ్ళను జీవితాంతం గుర్తు పెట్టుకునేలా చేస్తాయి...అలాంటి డౌన్ టు ఎర్త్ పర్సన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అలాంటి వాళ్ళల్లో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక సినిమా ఈవెంట్ జరిగితే ప్రతీ ఒక్కరినీ పేరుపేరునా ప్రస్తావిస్తూ థ్యాంక్స్ చెప్తారు. ఐతే ఎంత పెద్ద ఈవెంట్ ని ఐనా, ప్రొమోషన్ ని ఐనా, ఒక షోని ఐనా, లీడ్ చేసేది అందరితో మాట్లాడించి వాళ్ళను ఎంటర్టైన్ చేసేది యాంకర్. ఫంక్షన్ అంతా ప్రశాంతంగా జరిగిపోతుంది...ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ యాంకర్ ని ఎవరూ పట్టించుకోరు... యాంకర్ అంటే ఒక హీరోకి ఆడియెన్ కి మధ్య ఒక వారధి లాంటి వారు అని చెప్పొచ్చు. అలాంటి యాంకర్స్ ని సాధారణంగా ఎవరూ పట్టించుకోరు. కానీ అల్లు అర్జున్ మాత్రం అలా కాదు.
.webp)
యాంకర్స్ కి ప్రత్యేకంగా స్టేజి మీద థ్యాంక్స్ చెప్తారు. ఆ విషయాన్నీ యాంకర్స్ కూడా చెప్తున్నారు. ఇక వాళ్ళ ఆనందానికి అంతే ఉండదు. బాగా చేస్తే థ్యాంక్స్ అని, తప్పు చేస్తే సారీ అని చెప్పడం నిజంగా పెద్ద సంస్కారం..చిన్న పదాలే కదా ఈ రెండు అనుకుంటాం కానీ వాటిల్లోనే మన వ్యక్తిత్వం బయటపడుతుంది. ఇప్పుడు అదే జరిగింది. పెద్ద యాంకర్స్ కి మాత్రమే చాలామంది స్టార్స్ కానీ మూవీ యూనిట్ కానీ థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. చిన్న చిన్న , అప్ కమింగ్ యాంకర్స్ ని అసలు పట్టించుకోరు.. కానీ అల్లు అర్జున్ అలా కాదు..ఆయనకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈవెంట్‌కి ఎవరు యాంకరింగ్ చేసినా కూడా అల్లు అర్జున్ గుర్తుపెట్టుకుంటారు. థాంక్యూ అండీ.. యాంకరింగ్ చాలా బాగా చేశారని అంటారు. అదీ ఆయన సంస్కారం. యాంకర్లను గుర్తించే ఫస్ట్ యాక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అలాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. హరితేజ, ఉదయభాను, మంజూష, వింధ్యకు అల్లు అర్జున్ థాంక్స్ చెప్పిన విషయాలను గుర్తు చేశారు యాంకర్ వింధ్య విశాఖ. హరితేజని కూడా ఆయన విష్ చేశారు. బిగ్ బాస్ లో చూసాను బాగా చేశారు అని మెచ్చుకున్నారు.
![]() |
![]() |